![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -150 లో...... చక్రి, మహా ఇంటికి వస్తారు. చక్రి డల్ గా ఉంటాడు. ఏమైందని మాధవ అడుగుతాడు. ఏం లేదు అన్నయ్య తలనొప్పిగా ఉందని చక్రి అంటాడు. ఆ తర్వాత శైలు ఇంటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. కాలేజీకి నాన్న అని శైలు అబద్ధం చెప్తుంది. ఇప్పుడు అడిగితే భయం పోతుందని కేశవ గురించి అడుగకుండా సైలెంట్ గా ఉంటాడు.
ఆ తర్వాత రాత్రి చక్రి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రా అసలు భోజనం కూడా చేయలేదని మాధవ అడుగుతాడు. ఏం లేదని చక్రి అంటాడు. బయటకు వెళ్లారు కదా ఏదో జరిగే ఉంటుంది చెప్పు అని కేశవ అడుగుతాడు. రెస్టారెంట్ కి వెళదాం అంది హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ విడాకులు తీసుకుందామని అంటుందని చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను ఎలాగైనా తనలో మార్పు వచ్చేలా చేస్తాను. తన నోటితో తనే వచ్చే వాలింటైన్ డే రోజు ఐ లవ్ యు చెప్పేలా చేస్తానని చక్రి అనగానే కన్నా, కేశవ నవ్వుకుంటారు. మరుసటిరోజు ఇల్లు చూడడానికి మహా ఆఫీస్ వాళ్ళు వస్తున్నారని మాధవ వాళ్ళు అంత క్లీన్ చేస్తారు. అప్పుడే విక్కీ, దివ్య వస్తారు. విక్కీ ని చూసి వీడేంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడని చక్రి అనుకుంటాడు. విక్కి ఇల్లు చూసి బాగుందని చెప్తాడు. మహాని లక్కీ అని విక్కీ పిలుస్తుంటే చక్రికి కోపం వస్తుంది. ఆ రోజు ఆఫీస్ కి వచ్చి గొడవ చేసింది ఇతనే కదా.. నీకు ఏమవుతాడని మహాని విక్కీ అడుగుతాడు. దాంతో తను నాకు కజిన్ అని మహా చెప్తుంది.
ఆ తర్వాత కన్నా, కేశవ నవ్వుకుంటారు. చక్రి ఫీల్ అవుతుంటే అత్తకొడుకులని కూడా కజిన్ అంటారని కన్నా చెప్పగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత విక్కీ, దివ్య, మహా వెళ్తారు. ఆ తర్వాత శైలు, కేశవ మాట్లాడుకుంటుంటే వాళ్ళ నాన్న చూస్తాడు. నువ్వు కాలేజీకి అని వెళ్లి చేస్తున్నా పని ఇదా అని శైలుని కొడతాడు. నువ్వు ప్రేమించడానికి ఈ మెకానిక్ గాడే దొరికాడా అని శైలు ని వాళ్ళ నాన్న తిడుతాడు. నన్ను ఏమైనా అనండి.. తనని ఏం అనకండి నేనే ప్రేమించానని శైలు చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళండి నేను వస్తానని శైలు చెప్తుంది. కేశవ సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో నేను, చక్రి లాయర్ దగ్గరికి వెళ్తున్నాం..విడాకులు తీసుకోవడానికి అని మాధవ వాళ్ళకి మహా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |